సీతాకోకచిలుకలు – Zebra blue or Plumbago blue butterfly

Leptotes plinius – Zebra blue or Plumbago blue butterfly

Leptotes plinius (image-1)

ఈ సీతాకోకచిలుకలు పరిమాణంలో చాలా చిన్నవి. మామూలు సీతాకోకచిలుకలతో పోలిస్తే వాటిలో సగమంత ఉంతాయి. ఒకప్పుడుండిన ఐదుపైసల నాణెమంత పరిమాణంలో ఉండి, రెక్కలను చాలా వేగంగా ఆడిస్తూ ఎగురుతుంటాయి. ఒక్కొకసారి ఎంతసేపు వేచివున్నా కూడా ఎగరడం ఆపవు. చాలా sharp కదలికలతో ఎగురుతుంటాయి. చూపులతో వీటి కదలికలకు అనుగుణంగా అనుసరించడం చాలా కష్టం. అయితే ఒకసారి ఏదైనా పూవుమీద వాలాక ఒకింత సేపు అక్కడ నిలుస్తాయి అని అనిపించింది నా అనుభవంలో.  వీటి రెక్కల మీది చారలను పోలిన గుర్తుల వలన వీటికి Zebra blue butterflies అని పేరు.వీటికి Plumbago blue butterflies అని కూడా పేరు. వీటి లార్వాలు Plumbago Zeylanica అనే శాస్త్రీయ నామం కలిగిఉన్న చెట్టు యొక్క పూమొగ్గల నుంచి పూవుల నుంచి ఆహారాన్ని తీసుకుని పెరుగుతాయి కాగట్టి ఆ పేరు. ప్లంబాగో ప్రజాతికి చెందిన పూల చెట్టు ఇది; నీలి రంగులో పూవులను పూస్తుంది. చిత్రక్ అని భారతదేశంలో పేరు. ఔషధగుణాలు కలిగిన పూల చెట్టు.  Plumbago indica ఎరుపు రంగులో పూవులను పూస్తుంది. ఉద్యానవనాల్లో అలంకరణకు కూడా ఈ మొక్కలను ఎక్కువగానే పెంచుతారు.

Leptotes plinius (image-2)

ఈ  సీతాకోకచిలుకల పూర్తి Scientific classification ఇలా ఉంటుంది – Kingdom: Animalia; Phylum: Arthropoda; Class: Insecta; Order:Lepedoptera; Family: Lycaenidae; Genus: Leptotes; Speceis: Leptotes plinius).

Leptotes plinius (image -3)

ఈ సీతాకోకచిలుక వెనుక రెక్క అడుగు వైపు చివరన రెండు రెక్కలకూ రెండు తోకలు, రెక్క నుంచి ఆ తోకలు మొదలయ్యే చోట రెండు గుండ్రని ప్రస్పుటమైన మచహలూ ఉంటాయి. రెక్కలు మీది వైపు ఈ zebra type markings ఏమీ ఉండకుండా సాదాగా ఉంటాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ సీతాకోకచిలుక దర్శనమిస్తుంది. ఇంకా శ్రీలంక, చైనా, మ్యాన్మార్,జావా  దేశాలలోనూ కనపడుతుందట.

Leptotes plinius on Plumbago Zeylanica flower (image-4)

భారతదేశంలో కనుపించే ఈ సీతాకోకచిలుక subspecies పేరు Leptotes plinius plinius Fabricus. ఈ సీతాకోకచిలుక ఫోటోలను నేను బెంగళూరు లోని లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను.

Leptotes plinius on Plumbago Zeylanica flower (image-5)