మరో పూవుపై వాలేందుకు ఎగురబోతూ…

on flight to...

వాలి వున్న పూవుతో పనైపోయీ, చూపు మరో పూవు మీదికి మళ్ళి…ఆ పూవు వైపుకు పయనమవుతూ…ఈ సీతాకోకచిలుక, (Phalanta phalantha) ఒక  Common Leopard butterfly…

సీతాకోకచిలుకలు – Plain Tiger butterfly

Danaus chrysippusPlain Tiger butterfly

Danaus chrysippus  (image-1)

African Monarch అని కూడా ఈ సీతాకోకచిలుకకు మరొక పేరు. Monarch సీతాకోకచిలుక, Common Tiger సీతాకోకచిలుక, ఈ  Plain Tiger సీతాకోకచిలుక – ఈ మూడూ చిన్న చిన్న తేడాలు మినహాయిస్తే, చూడడానికి ఒకేలా కనుపిస్తాయి.  ఉత్తర అమెరికా కు చెందిన అత్యంత ప్రసిధ్ధి చెందిన సీతాకోకచిలుక  Monarch సీతాకోకచిలుక. దీనికీ, భారతదేశంలో చాలా చోటల కనుపించే Common Tiger సీతాకోకచిలుకకు చాలా పోలికలు ఉండి ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పుకుంటున్న Plain Tiger సీతాకొకచిలుకకు, Common Tiger కూ ఒకే తేడా – Common Tiger కు రెక్కలపై చారలు, రెక్కల అడుగు వైపు నల్లగా మరీ ప్రస్ఫుటంగా కనుపిస్తాయి. Plain Tiger కు రెక్కలపై నల్లరంగులో చారలనేవి ఉండవు, రెక్కలు సాదాగా ఉంటాయి.

Danaus chrysippus (image-2)

Nymphalidae కుటుంబంలోని, Danaine ఉపకుటుంబానికి చెందిన ఈ Plain Tiger సీతాకొకచిలుక పూర్తి శాస్త్రీయ వర్గీకరణ ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Nymphalidae, Genus: Danus, Species: D. chrysippus.

Danaus chrysippus (image-3)

7-8 సెం.మీ. నిడివిలో ఉండే రెక్కలు నారింజరంగు పసుపు రంగు కలిసినట్లుండే (tawny) రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ రంగు రెక్కలకు మీదవైపు ఎక్కువగా ఉండి, రెక్కల లోవైపు లేతగా ఉంటుంది. రెక్కలకు ముదురుగోధుమ లేదా నల్లని రంగు మందపు అంచు వుండి ఆ అంచులో తెల్లని గుండ్రని మచ్చలు అందమైన, ఆకర్షణీయమైన బార్డరుగా ఏర్పడి కనిపిస్తాయి. వెనుక రెక్క మీద మూడు నల్లని మచ్చలు ఉంటాయి. ముందు రెక్క పై అంచు నల్లగా వుండి మధ్యలో తెల్లని మందమైన చార ఉంటుంది.

ఈ సీతాకోకచిలుకలకు అభక్షణీయత (non-edible) లక్షణం ఉంది. రెక్కలు మందంగా ఉండి తోలు (leathery) లాగా ఉంటాయి. అందువలన నెమ్మదిగా ఎగురుతూ కనిపిస్తాయి. శత్రువుల దాడినుంచి ఇవి మృత్యువును నటించి కూడా తప్పించుకుంటాయట. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. ఈ సీతాకోకచిలుక ఫోటోలను నేను బెంగళూరులోని లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను.

Danaus chrysippus (image-4)