పట్టు (Grip)

చిన్న జంతువైనా, పెద్ద జంతువైనా, అది నివసించే ప్రదేశాన్ని బట్టి ఒక్కొక జంతువుకు ఒక్కొక చోట పట్టు అధికంగా వుంటుంది. మొసలికి నీళ్ళలోను, ఉడుముకు నేల మీదా, సాలీడుకు దాని web లోనూ, పాకే బల్లికి గోడ మీదా ఇత్యాదిగా. అలాగా, పాకే జంతువులలోనే ఒకటైన దీనికి grip ఇలాగా…

GRIP_1

అదలా వుంటే, ఈ కందిరీగ, సైజులో  దానికంటె పెద్దదయిన పురుగును ఎక్కడినుంచో ‘పట్టి’ తెచ్చుకొంటోంది. అవతల ఆ పురుగు ఎంత గింజుకున్నా కందిరీగ పట్టునుంచి విడిపించుకోలేక పోతోంది. ప్రకృతి ధర్మం గదా మరి!

GRIP_2

GRIP_3

Common Sandpiper పక్షి

Common Sandpiper Bird -image/1
Common Sandpiper Bird -image/1

పరిమాణంలో చిన్నదిగా, పుల్లలులా అనిపించేంత సన్నని కాళ్ళతో ఉంటుంది ఈ పక్షి.

Water bodies – చెరువులు, వాటి బురద బురదగా ఉన్న అంచులలోనూ, సముద్రపు ఒడ్డున బీచి లలోనూ ఉంటుంది. ఆ తేమ నిండివున్న ప్రదేశాలనుంచి చిన్నచిన్న పురుగులను వాటిని ఏరుకుని తింటూంటుంది. Water bodies కి దగ్గరలోనే నేల మీదనే గూడు ఏర్పాటు చేసుకుని పిల్లలను పొదుగుతుందట ఈ పక్షి.

Common Sandpiper Bird -image/2
Common Sandpiper Bird -image/2

గోవాలో, మజౌడా (Majorda) బీచిలో తీసినవి ఈ ఫోటోలు. అల వొడ్డుకు వచ్చి వెనక్కి వెళ్ళేంతలోనే చాల వేగంగా ఈ పక్షి తీరానికి కొట్టుకుని వచ్చిన వాటిల్లోంచి అది అహారంగా తినగలిగే వాటిని వెతుక్కుని ముక్కున కరుచుకుని తినేస్తుంది.

Common Sandpiper Bird -image/3
Common Sandpiper Bird -image/3

సముద్రపు నీటి అల వేగాన్ని తట్టుకుని ఇంత చిన్నదిగా అనుపించే ఈ పిట్ట  నిలబడగలదా అనిపిస్తుంది గాని ఆ నీళ్ళలో ఇది పరుగెట్టే వేగం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దానికి ప్రకృతి సహజంగా వచ్చిన దాని technique వుంది. అదే దానిని కాపాడుతూ వుంటుంది. ఆ మాటకొస్తే ఏ జంతువునైనాను!

Common Sandpiper bird -image/4
Common Sandpiper bird -image/4

‘Blue Tailed Bee Eater’ పక్షి

Bee_Eater_1

తెలుగులో ఈ పిట్ట పేరేమిటో తెలియక సగం ఇంగ్లీషు, సగం తెలుగుతో ఈ తంటాలు.

Bee_Eater_1A

ఈ పక్షులు ముఖ్యంగా తేనెటీగలను, అవి గాకుండా ఇంకా చిన్న చిన్న పురుగులను, తూనీగలంత పరిమాణంలో relative గా పెద్ద పురుగులను కూడా గాల్లో అవి ఎగురుతుండంగానే పట్టేసుకుని, వాటినే ఆహారంగా బతుకుతాయి కాబట్టి వీటికి ఈ పేరు. మొత్తంగా ఇవి ఒక తరగతికి చెందుతాయి.

Bee_Eater_2

వాటిల్లో వాటి రెక్కల రంగును బట్టి Blue Bee Eater అనీ Green Bee Eater అనీ, అలా ఇంకా కొన్ని రకాలయిన పేర్లతో  బేధాలునాయి. ఈ రకాలలో ఇక్కడ నా కెమెరాకు దొరికింది ‘Blue Tailed Bee Eater’ పక్షి  అనుకుంటున్నాను.

Bee_Eater_birds_3

ఇవి ముఖ్యంగా హరిత ప్రదేశాల్లోనూ, చిన్నా పెద్దా పొదలు వుండే ప్రదేశాల్లోనూ ఎగురుతూ వుంటాయి. పరిమాణంలో పిచ్చుకలంతే వుంటాయి.  తోక ఒక్కటే పొడుగుగా వుండి వీటికి ఒక చిత్రమైన ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చింది. ఆడా మగా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. Breeding లో గుడ్ల పైన, ఆ తరువాత వాటి పిల్ల పక్షులపైనా ఇరు రకాల పక్షులు కలిసి సంరక్షణను ఇస్తాయట!

పదాంగుటము…పురుష విరహమూ…

bfly_from top_1A

“తలచిన హృదయము ఝల్లను తరుణీమణి ఒయ్యారము
కలిగీనా ఇక నొకపరి కన్నుల జూడగను…

మో మరవాంచి పదాంగుటమున నిల నొయ్యన వ్రాయుచు
కోమలి కన్నీ రెడనెడ గ్రుక్కుచు రెప్పలను
వేమరు నా దెస చూచుచు వీడగ నొల్లని భావము
ఏమని తలపోయుదు విధి నేమని దూరుదును….”

అన్నమయ్య శృంగార కీర్తనలలోనిది ఇది. ఇందులోని భావం:

“ఆ అందగత్తె  ఒయ్యారాన్ని  గుర్తుచేసుకుంటే హృదయం ఝల్లుమంటుంది
మళ్ళీ ఒక్కసారన్నా ఆ ఒయ్యారాన్ని చుసే భాగ్యం ఈ కళ్ళకు కలుగుతుందా….

వదనాన్ని సంగంవంచి పాదం బొటనవేలుతో నేల మీద అదేపనిగా రాస్తూ
కన్నీరు అమాంతంగా ఉబికివస్తున్నా ఆమె  రెప్పల అడుగుననే వాటిని దాచేస్తూ
వెయ్యిసార్లు నా వంకకే చూస్తూ విడిచి వెళ్ళడానికి ఇష్టపడని ఆ భావాన్ని
ఏమని నేను గుర్తుచేసుకోను, విధిని ఏ మాటలతో నేను దూషించను…..”

తెలిసిన భావచిత్రమే కదా ఇది! ఎన్ని చిత్ర లేఖనాల్లో, ఎన్ని సినిమాల్లో, ఇంకా ఎన్నెన్ని పాటల్లో బహుశా ఒక్కొక్క generation కి ఒకసారి మళ్ళీ మళ్ళీనూతనంగా  పుట్టుకొస్తూ, వ్యక్తమవుతూ వస్తున్న భావచిత్రం ఇది! అన్నమయ్య వ్యక్తీకరించింది ఇందులో పురుష విరహం. అన్నమయ్యది క్రీ.శ. 15వ శతాబ్దం. నేను చదివినంత వరకు,  నా దృష్టికి వచ్చినంత వరకు ఈ భావ చిత్రాన్ని మొట్ట మొదటగా వ్యక్తీకరించింది అన్నమయ్యే! అంటే ఎంత కాదన్నాసాహిత్య చరిత్రలో  ఈ భావ చిత్రానికి  first recorded instance  ఈ పదంలో అన్నమయ్యది….కనుక ఈ మాటలలో ఈ భావ చిత్రానికి 500 ఏళ్ళ వయసు! అయినా, ఇది ఎప్పటి కప్పుడు నిత్య నూతనమవుతూ ఈ అయిదు శతాబ్దాలుగా మళ్ళీ మళ్ళీ వినబడుతూ కనబడుతూనే వుంది. ఇకముందూ కనబడుతూనే వుంటుంది కూడా! ఎందుకంటే, పై ఫోటోలోని natural phenomenon లాగా, లలితమైన పురుష హృదయం అనేది ఉన్నంత కాలం  ఈ భావానికి కాలం చెల్లడం అనేది ఉండదు కాబట్టి!

బాష పరంగా ఇందులోని అరవంచు (ముఖాన్ని నేల వైపుకు సంగంగా వంచడం), పదాంగుటము (పాదపు బొటనవ్రేలు) – ఇవి వినసొంపుగా వుండే అచ్చమైన తెలుగు మాటలు! అందునా ముఖ్యంగా ‘పదాంగుటము’ అనే మాట – ఈ శృంగార కీర్తనలోని ఒయ్యారమంతా ఆ పదంలోనే ఉన్నట్లు నాకనిపిస్తుంది.

King’s Mantle పుష్పం

King's Mantle_1

కొన్ని పూవులు  చూడగానే వెరైటీగా అనిపిస్తాయి, బాగుంటై!.  అయితే,  పేరేమిటో తెలియకుండా ఉంటుంది. అలాంటి పూవులలో ఇదొకటి. ఈ పువ్వు పేరు కనుక్కోవడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. Search terms లో ఏం రాయాలి? flower with blue petals అనీ, dark blue petals అనీ… ఇట్లా రక రకాలుగా search చేసి, ఎంతసెపటికీ దొరకక  ఇక విసుగెత్తి ఆపేద్దామనుకుంటున్న తరుణంలో దొరికింది ఇది King’s Mantle అనే పేరుతో!

King's Mantle_2A

తెలుగులో పేరేమిటో తెలియ లేదింకా. Colors బాగుంటై, అదోరకమైన పాల మీగడ లాంటి తెలుపు రంగు tube ఆ పై రెక్కలు నీలం రంగు combination లో! Tube లోపలి వైపు పసుపు పచ్చరంగు  ఒక రకమైన నిగారింపుతో వుంటుంది, tube end అయి, రెక్కలు మొదలయ్యే దాకా!

King's Mantle_3

King's Mantle_4

This good looking flower’s botanical name is ‘Thunbergia erecta’. ఇంతకు మించి విశేషమైన సమాచారం ఏదీ ఈ పూవును గురించి ఇప్పటికి లేదు (దొరకలేదు!).