సీతాకోకచిలుకలు – Common Grass Yellow butterfly

Eurema hecabe – Common Grass Yellow butterfly

Eurema hecabe (image-1)

నిమ్మ-పసుపు పచ్చ వర్ణం (lemon-yellow) లో మెరిసే రెక్కలతో ఉండే ఈ సీతాకోకచిలుక సాధారణంగా భూమికి మామూలు ఎత్తుగా పెరిగే పొదలు, భూమిపై పరుచుకుని ఉండే గడ్డిలోనే ఎగురుతూ కనబడుతుంది; అందుకనే ఆ పేరు. ఆకు పచ్చని పొదల ఆకుల మధ్యన, గడ్డి మీదా ఒకింత వేగంగానే రెక్కలను కదిలిస్తూ ఎగురుతూన్నపుడు వాటి రెక్కల లేత పసుపు పచ్చని వర్ణం, వెనక ఆకుల ఆకుపచ్చని వర్ణంలో కొట్టొచ్చినట్లుగా కనబడుతూ  చూడడానికి ఆకర్ష్ణీయంగా ఉంటుంది. Pieridae కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక పూర్తి శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Pieridae, Genus: Eurema, Species: Eurema hecabe.

Eurema hecabe (image-2)

కాస్త పరిశీలనగా చూస్తే, ఈ సీతాకోకచిలుక రెక్కల మీద ఎరుపు గోధుమ వర్ణాలు మిళితమైన  (reddish brown) రంగులో చిన్న చిన్న మచ్చలు కనబడతాయి, విస్తారంగా మాత్రం కాదు, అక్కడక్కడా మాత్రమే! మొదట ఫోటోలో చూసినపుడు ఈ సీతాకోకచిలుక రెక్కల మీద ఇవేవో గడ్డికి లేదా ఆకులకు అంటుకుని వున్న మట్టి దీని రెక్కలకు అవడంవలన అయిన మచ్చలు అనుకున్నాను. కానీ అది నిజం కాదనీ, అవి ఈ సీతకోకచిలుక రెక్కల మీద సహజంగానే ఉన్న మచ్చలనీ దీనిని గురించి చదివిన తరువాత తెలిసింది.

Eurema hecabe (image-3)

ఉష్ణమండల (tropical region) ప్రదేశాలలో కనిపించే సీతాకోకచిలుకలలో ఈ Common Grass Yellow సీతాకోకచిలుక ఒకటట. హిమాలయాలకు దిగువన ఉన్న ఆసియా దేశాలలోనూ, ఆఫ్రికా లోనూ ఎక్కువగా కనబడుతుంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో చాల చోటల కనపడుతుంది.  తడిగా ఉన్న ప్రదేశంలో mud puddling చేస్తూ కూడా ఈ సీతాకోకచిలుక నా కెమేరా లెన్సుకు చిక్కింది. ఈ సీతాకోకచిలుకను నేను బెంగళూరు లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో ఫోటోలు తీశాను.

Eurema hecabe (image-4)