మరో పూవుపై వాలేందుకు ఎగురబోతూ…

on flight to...

వాలి వున్న పూవుతో పనైపోయీ, చూపు మరో పూవు మీదికి మళ్ళి…ఆ పూవు వైపుకు పయనమవుతూ…ఈ సీతాకోకచిలుక, (Phalanta phalantha) ఒక  Common Leopard butterfly…

సీతాకోకచిలుకలు – Common leopard butterfly

Phalanta Phalantha – Common leopard butterfly

Phalanta phalantha (iamge-1)

గమ్మత్తైన అందంతో నన్ను mesmerise చేసి, దాదాపు అరవై – డెభ్భై దాకా ఫోటోలు తీయించుకున్న సీతాకోకచిలుక ఇది, Common leopard butterfly; Binomial పేరు – Phalanta Phalantha!
(Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order; Lepidoeptera, Family: Nymphalidea, Genus: Phalanta, Species: Phalanta phalantha).

Phalanta phalantha (image-2)

జేగురు రంగులో ఉండే రెక్కల మీద (రెక్కల నిడివి 50-55 మి.మీ) నల్లని రంగులో మచ్చలతో చూడడానికి చిరుతపులి శరీరం మీది మచ్చల్లా అనిపిస్తాయి. అందువలన ఈ సీతాకోకచిలుక పేరులో ఆ leopard అన్న పదం. చూడడానికి medium size లో ఉండే ఈ సీతాకోకచిలుక చాలా హుషారుగా ఉంటుంది. వేగం ఎక్కువే! నీడలో కంటే ఎండలో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుందట. సమయం దొరికినప్పుడల్లా రెక్కలను ఎండలో విప్పార్చుకుని basking చేయడంలో ఆనందాన్ని పొందుతుందట.  Mud puddling చేసే సీతాకోక చిలుకలలో ఇదీ ఒకటి. మామూలుగా అయితే, తడిగా ఉన్న వాతావరణం కంటే, పొడిగా ఉన్న వాతావరణాన్నే ఎక్కువ ఇష్టపడుతుంది. Dry weather లోనే ఎక్కువగా ఈ సీతాకోకచిలుక కనిపిస్తుందట.

Phalanta phalanta (images 3 & 4)

ఈ సీతాకోకచిలుకకు వేగం ఎక్కువ, కదలికలు అంచనాలకు అందకుండా చాలా sharp కావడం మూలంగా ఫోటోలు తీయడంలో వేగం అవసరం అని నా అనుభవంలో నాకు అనిపించినది. అయితే, ఒకసారి వదిలి వెళ్ళినా, కొద్ది సేపట్లో మళ్ళీ అదే ప్రదేశానికి తిరిగి రావడం ఈ సీతాకోకచిలుక చేస్తుంది కాబట్టి, నాకు అనిపించింది it allows easy photographing అనే! చాలా close up షాట్స్ తీశాను కూడా! (ఇక్కడ close up షాట్స్ అంటే నా ఉద్దేశం సీతాకోకచిలుకకు దగ్గరగా నిలబడి తీయాలనికాదు; కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దగ్గరగా నిలబడడాన్నీ ఈ సీతాకోకచిలుక వీలు కలిగిస్తుందని చెప్పడం మాత్రమే!) పూలను వదిలి ఇది ఎక్కువ కాలం ఉండలేదట. అందువలన పూవులున్న ప్రాంతాలకు ఇది ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటుంది. అయితే, పక్కన వేరే సీతాకోకచిలుకల పొడ వీటికి గిట్టక పోవడం అన్నే ఒక (అవ) లక్షణం  ఈ సీతాకోకచిలుకకు ఉంది. పక్కన ఉన్న వేరే సీతాకోకచిలుకలను తరిమేయడం ఇవి మొదటగా చేస్తాయి!

                          

    

                                                                                                                                                             Phalanta phalantha (images 5 to 8)

సబ్-సహారన్ ఆఫ్రికాలోనూ, దక్షిణ ఆసియాలోనూ ఈ సీతాకోకచిలుక కనుపిస్తుందట. భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలోనూ, దక్షిణ రాష్ట్రాలలో ఎక్కువగానే కనబడుతుంది.  శ్రీలంక, బర్మా దేశాలలోనూ కనబడుతుందట.

ఇక్కడి ఈ సీతాకోకచిలుక ఫోటోలన్నీ ఒకే రోజు సెషన్లో బెంగళూరు లాల్ బాగ్ గార్డన్స్ లో నేను తీసినవి.

Phalanta phalantha (image 9)

Phalanta phalantha (image-10)