సీతాకోకచిలుకలు – The Pioneer White butterfly

Anaphaeis aurota – The Pioneer White butterfly

ఫొటోగ్రఫీ అనేది ఒక సరదా వ్యాసంగంగా మొదలై ప్రకృతిలో చెట్ల ఆకులు రంగురంగుల పూవులమీదుగా ప్రయాణం సాగి చివరికి ప్రధానంగా వాటినే ఆశ్రయించుకుని జీవనం సాగించే తేనెటీగలు, సీతాకోకచిలుకల దగ్గరకు చేరింది. అలా తీయగా తీయగా ఈ సీతాకోకచిలుకల ఫోటోలు దగ్గరదగ్గరగా రెండు వందలదాకా చేరాక ఆ ఫోటోలను చూసినప్పుడల్లా వీటిని గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగి, ఆ కోరిక రోజులు గడిచే కొలదీ పెరిగి చివరికి ఒక రోజు వెదకడం మొదలుపెడితే వేలవేల రకాలతో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యమే ఎదురుపడింది. ఆ వేలవేలల్లో భారతదేశంలో మనకు సాధారణంగా (కొన్ని అరుదుగా) కనుపించే కొన్ని వేల  సీతాకోకచిలుకలలో ఒకటి The Pioneer White butterfly, ఒక కొంత అరుదైనదే!దీనిని గురించిన సమాచారం కూడా అంత ఎక్కువగా ఏమీ దొరకదు. దొరికినంతలో –

Anaphaeis aurota (image-1)

సీతాకోకచిలుకలు అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. శాస్త్రీయ వర్గీకరణను అనుసరించే మాటలలో చెప్పుకోవాలంటే ఏనిమేలియా సామ్రాజ్యంలో ఆర్థ్రోపోడా ఫైలంలో హెక్సాపోడా సబ్ ఫైలంలో ఇన్సెక్టా తరగతికి చెందిన జీవులు కీటకాలు. ఇప్పటివరకూ జీవించివున్న అన్ని జీవులకంటే అత్యంత విజయవంతమైన జీవసమూహం కీటకాలు. సృష్టిలో కీటకాల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటే ఎక్కువ.

సీతాకోకచిలుకలు కీటకాల తరగతిలో లెపిడోప్టెరా అనే వర్గానికి చెందినవి. ఇందులో Papilionoidia అనే
superfamily కి చెందినవి నిజమైన సీతకోకచిలుకలు. మిగలిన రెండు superfamily లలో skipper లూ, moth లూ చేరాయి.

Anaphaeis aurota (image-2)

Papilionoidia అనే superfamily లోని అయిదు families లో Whites or Yellow-Whiles, Pieridae అనేది ఒకటి. ఈ Pieridae అనే కుటుంబపు సీతాకోకచిలుకలలో మొత్తం 76 genera లలో దాదాపు 1,100 species ఉన్నాయట. ఈ రకం సీతాకోకచిలుకలు చాలావరకు tropical Africa లోనూ, ఆసియా లోనూ కనబడతాయట. వీటిలో చాలామటుకు తెలుపు, పసుపు ఇంకా ఆరంజ్ రంగు రెక్కలతోనూ, ఆ రెక్కలపైన నలుపు రంగు చారలతోనూ, మచ్చలతోనూ ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. ఈ color pigmentation వీటి శరీరంలోని వ్యర్ధ పదార్ధాల నుంచి తీసుకోబడుతుందనీ, ఇదే ఈ రకపు సీతాకోకచిలుకల ప్రత్యేకత అనీ, ఈ రకపు సీతాకోకచిలుకలలో 81 species సీతాకోకచిలుకలు భారతదేశంలో కనబడతాయనీ దొరికిన సమాచారం.

Anaphaeis aurota (image-3)

Whites or Yellow-Whites, Pieridae కుటుంబానికి చెందిన సీతాకోకచిలుకలలోని భారతదేశంలో కనుపించే 81 species లలో ఒకటి The pioneer అని పిలవబడే సీతాకోకచిలుక. దీనినే Caper White అని కూడా పిలుస్తారు. ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Anaphaeis aurota. శ్రీలంకలోనూ, మనదేశంలో హిమాలయాలు, కాశ్మీరు, దక్షిణాన తమిళనాడులోని నీలగిరికొండలు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ  ఇత్యాదిగా ప్రదేశాలలో ఇవి కనిపిస్తాయి. హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాలలో కనుపించే ఈ రకపు సీతాకోకచిలుకల రెక్కలు తెలుపు, పసుపు వర్ణాలతోనూ, వాటిపై నల్లని చారలతోనూ ఉంటాయి.చాలా వేగంగా ఎగురుతూ ఒక ప్రదేశాన్నుంచి ఇంకొక ప్రదేశానికి ఒక నిర్దేశిత పథంలో పయనించడమనే లక్షణమేమీ లేకుండా ఎటుపడితే అటుగా ఇవి ఎగిరిపోతుంటాయి. బెంగళూరు లోని లాల్ బాగు గార్డెన్స్ లో ఈ సీతకోకచిలుక నా కెమేరా లెన్సుకు చిక్కింది.

Anaphaeis aurota (image-4)

Anaphaeis aurota (image-5)