సీతాకోకచిలుకలు – Lemon Pansy butterfly

Junonia LemoniasLemon Pansy butterfly

Pansy సీతాకోకచిలుకలు (Class: Insecta, Order: Lepidoeptera, Family: Nymphalidae, Species: Junonia) మొత్తం ఆరు రకాలలో, Lemon Pansy ఒకటి. ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Junonia Lemonias.

Lemon Pansy (image-1)

ఈ సీతాకోకచిలుక ముదురు గోధుమ వర్ణం రెక్కల మీద ప్రస్ఫుటమైన eye-spots – కన్నులను పోలిన మచ్చలతో, ఇంకా నలుపు వర్ణం, నిమ్మకాయ పసుపు (lemon-yellow) వర్ణపు మచ్చలతో చాలా వేగంగా పూల మొక్కల మధ్య తిరుగుతూ వుంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా వుంటుంది. Pansy సీతాకోకచిలుకలలో చాలా ఎక్కువగా కనుపించే సీతాకోకచిలుక ఈ Lemon Pansy. రెక్కల నిడివి 45-60 మి.మీ. భారతదేశంలో చాల ప్రదేశాలలో (హిమాలయాలు, గుజరాత్ ప్రాంతం, బెంగాల్ ప్రాంతం, దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ) కనుపించే సీతాకోకచిలుక ఈ Lemon Pansy. ఇంకా దక్షిణ ఆసియా లోని చాలా దేశాలలో ఈ సీతాకోకచిలుక కనబడుతుందట.

Lemon Pansy (image -2)

నేను గమనించినంతలో ఈ Lemon Pansy సీతాకోకచిలుక ఎప్పుడూ పువ్వులనూ ఆకులనూ మాత్రమే అంటిపెట్టుకుని  ఉండకుండా నేలకు దగ్గరగా కూడా దిగుతుంది. నేలపై రాలి ఉన్న దళసరైన ఆకులమీద వాలడం, వాటి మీద నెమ్మదిగా నడవడం కూడా నేను చూసాను. ఆశ్చర్యపడ్డాను కూడా! ఇక్కడ మరొక సంగతి ఏమిటంటే, ఈ సీతాకోకచిలుక యొక్క ముదురు గోధుమ రంగు రెక్కలు ఎండుటాకుల రంగుతో కలిసిపోయి వాటి మీద వాలి ఉన్నపుడు దీనిని గుర్తించడం కష్టమవుతుంది కూడా! ఇంకోవిదంగా ఆలోచిస్తే, పరిసరాలలో ఈ విధంగా కలిసిపోవడం (camouflaging) అనేది ఈ సీతాకోకచిలుకకు  అవసరమయినప్పుడు తనను తాను శత్రువులనుంచి రక్షించుకోవడానికి కూడా ఉపయోగ పడుతుందనుకుంటాను. ఈ సీతాకోకచిలుక ఎప్పుడూ చాలా active గానూ చొరవతోనూ వుంటుంది. దగ్గరలో మనుషుల కదలికకు భయపడేట్లుగా కనపడదు. అందువలన తోటలలోనూ, పూవుల మధ్యనూ చాలా ఎక్కువగా కనబడుతూ చాలా విరివిగా ఫోటోలు తీయబడే సీతాకోకచిలుకలలో ఈ Lemon Pansy సీతాకోకచిలుక ఒకటి అయింది.

Lemon Pansy (image -3)

Peacock Pansy కి లాగానే ఈ Lemon Pansy సీతాకోకచిలుకకు కూడా ఎండ-స్నానం sun-bathing or basking under the sun ఇష్టం. ఎండలో రెక్కలను పూర్తిగా విప్పార్చుకుని ఉండి కనిపిస్తుంది. ఒకసారి వాలిన పూవు మీదకే మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ వుండడం అనే లక్షణం కూడా ఈ సీతాకోకచిలుకకు వుంది. ఈ కారణం చేత Lemon Pansy ని ఫోటోలు తీయడం మిగతా సీతాకోకచిలుకలతో పోలిస్తే సులభమే అనుకోవచ్చును. ఒక్క session లోనే  ఈ సీతాకోకచిలుకను దాదాపు 30-40 ఫొటోలు తీశాను నేను. Definitely, one of the easiest of butterflies to photograph! ఇక్కడి ఈ Lemon Pansy సీతాకోకచిలుక ఫోటోలన్నీ, ఆ ఒక్క session లో తీసినవే, బెంగళూరు లోని లాల్ బాగ్ గార్డెన్స్ లో తీసినవి!

Lemon Pansy (image -4)

Lemon Pansy (image-5)

        Lemon Pansy (image -6)

Lemon Pansy (image-7)