డిజిటల్ ఫొటో ఎడిటింగ్ – back-ground removal

సరదాగా (Hobby గా)   గానీ లేదంటే serious గా గానీ Digital photo editing లేదా manipulation దిశగా దృష్టి సారించిన ఎవరైన మొదటగా చేయబూనేది back-ground removal, తొలగించిన back-ground స్థానంలో నచ్చిన color gradient తో back-ground ను నింపడం!  ఈ exercise అంతా photo లోని main object ఏదియితే వుందో ఆ object అందాన్ని కావలసినంతగా ఎక్కువ చేయడానికే!

Digital photo-editing software అన్నిటిలోనూ ఇందుకు కావలసిన tools చాలానే అందుబాటులో వుంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి free selection tool, scissors tool ఇంకా magic wand అనే tool! ఫోటో లోని main object ని select చేసుకోవడానికీ, ఆ బాగాన్ని వదిలి మిగతా భాగాన్ని select చెసుకుని ఆ మొత్తాన్ని తొలగించుకోవడానికీ ఈ tools ఉపయోగపడతాయి. ఈ selection ప్రక్రియలో, main object ను ఎంత జాగ్రత్తగా, ఆ object కు సంబంధించిన edge details ను ఎంత సూక్ష్మంగా select చేసుకుంటే, అంతగా end product చూడడానికి బాగుంటుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

తొలగించుకున్న back-ground స్థానంలో కావలసిన రంగుల మేళవింపును నింపుకోవడం అనే ప్రక్రియకు ఉపకరించేది GRADIENT టూల్. ఈ టూల్ సహాయంతో ఏ కాంబినేషన్ లో కావాలంటే ఆ కాంబినేషన్లో రంగులను నింపుకోవచ్చును.

Plain_Tiger_bfly_bg_modified

Digital creations – Abstract art (3) : వదనం

Face...(Digital Abstract art creation)

‘సుఅణు వఅణం ఛివంతం సూరం మా సాఉలీఅ వా రేఇ’

(ణీలస్సః – గాథా సప్తశతి – శతకం 3 గాథ 69)

‘సుతను వదనం స్పృశంతం సూర్యం మా వస్త్రాంచలేన వారయ’

(సంస్కృత ఛాయ – భాషాసేవకులు స్వర్గీయ శ్రీ తిరుమల రామచంద్ర గారు)

‘తరుణి నీ మొగంబు దాకెడు సూర్యుని
చెఱగు వెట్టి యడ్డు సేయవద్దు’

(తెలుగు అనువాదం – కీర్తిశేషులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు)