సీతాకోకచిలుకలు – Peacock Pansy butterfly

Peacock Pansy – Junonia almana butterfly.

Peacock Pansy (image-1)

ఈ Peacock Pansy అనే సీతాకోకచిలుక Insecta తరగతిలో, Lepidoptera ఆర్డరులో Nymphalidea కుటుంబంలోని Junonia జీనస్ కు చెందినది. ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Junonia almana. 54-62 మి.మీ నిడివి వున్న నారింజపసుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే పెద్దపెద్ద రెక్కలతోనూ, ఆ రెక్కలపైన నెమలిపించం మీద కనుపించే కన్నుల్లాంటి కన్నులతోనూ వుండే ఈ సీతాకోకచిలుకకు Peacock Pansy అనే పేరు ఆ కారణంగానే వచ్చింది.

Peacock Pansy (image-2)

రెక్కల మీద ఉండే ఈ పెద్దపెద్ద కళ్ళను రెక్కలను విప్పార్చి చూపించి ఇది తనను తింటానికి దగ్గరకు వచ్చే వాటిని భయపెడుతుందట! ఆకాశం నిర్మలంగా ఉండి ఎండగా వున్న సమయాలలో రెక్కాలను బాగా విప్పార్చి ఎండ-స్నానం (sun bathing) చేయడం కూడా ఈ సీతాకోకచిలుకకు ఇష్టమట.

Peacock Pansy (image-3)

Pansy సీతాకోకచిలుకలు మొత్తం ఆరు రకాలు. వాటి రెక్కల రంగును బట్టి  అనుకుంటాను Grey pansy, Blue pansy, Yellow pansy, Chocolate pansy, Lemon pansy అని అయిదూ, రెక్కలపై నెమలిపింఛపు కళ్ళను పోలిన కళ్ళను బట్టి  Peacock pansy తో కలిపి మొత్తం ఆరు రకాలు. వీటిలో ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ Peacock pansy సీతాకోకచిలుక భారతదేశంలోనూ, ఆగ్నేయ ఆసియాలోనూ, చైనా, జపాను దేశాలలోనూ ఈ సీతాకోకచిలుక కనపడుతుందట.

Peacock Pansy (image-4)

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో ఇది కనబడుతుంది. ఇవి సాధారణంగా ఒకటిగా కాకుండా, రెండు మూడు కలిసి ఒక సమూహంగా ఎగరడాన్ని, రెండు మూడు కలిసి ఒక సమూహంగా ఒకే చోట కనిపించడాన్ని ఇష్టపడతాయట. నేను తీసిన ఈ Peacock pansy సీతాకోకచిలుక ఫోటోలు కూడా బెంగళూరు, లాల్ బాగ్ గార్డన్స్ లోనివే!

Peacock Pansy (image-5)