‘GIMP’ తో సరదాలు – 1

GIMP – GNU Image Manipulation Program  – డిజిటల్ ఫోటోలలోని లోపాలను సవరించుకోవడానికి, నచ్చిన విధంగానూ, మరింత ఆకర్షణీయంగానూ ఫోటోలను చేసి చూసుకోవడానికి మనకు అందుబాటులో వున్న ఒక అత్యంత శక్తివంతమైన software application! ఈ software సేవలు పూర్తిగా ఉచితం కూడా!

Structural గా – అంటే నిర్మాణపరంగా డిజిటల్ ఫోటోలు layers గా అమర్చబడదానికి వీలయేవి కావడం వలన ఒక ఫోటోని layers లో దశలు దశలుగా ఆకర్షణీయంగా మార్చడానికి, ఆ ఫోటోలోని వివిధమైన అంశాలను manipulate చేయడానికి చాలా బాగా వీలు కల్పిస్తుంది GIMP! కొన్ని సందర్భాలలో ఒక్క ఫోటోలో డజన్ల కొద్దీ layers ఉండడం అనేది professional photographers చేసి చూపించే ఫోటోలలో ఉంటుందట!

GIMP లో ఒక డిజిటల్ ఫోటోని పరిమాణం మార్చడం, color contrast మార్చడం, అందులోని విడి భాగాలను కత్తిరించి వేరే చోట copy చేయడం లాంటి సాధారణమైన image manipulations తో పాటు, ‘out of bounds effect ‘లాంటి కొన్ని advanced level special effects  ను సాధించడం కూడా వీలవుతుంది.

‘Out of bounds’ అనే manipulation technique ని నేర్చుకోవడానికి, అందులో ప్రావీణ్యత సాధించడానికి కాస్త సమయం ఎక్కువే పడుతుంది. అయినప్పటికీ, ఆ technique ఉపయోగించి మార్చబడిన ఫోటోలు ఇచ్చే effect చూడడానికి చాలా ఆకర్షణీయంగానూ, ఒకింత ఆశ్చర్యాన్ని కలగజేసేదిగానూ కూడా ఉంటుంది. ఆ technique ఉపయోగించి మార్చబడిన ఈ ఫోటోలో ఆ లక్షణాలు కనబడుతుతున్నాయనుకుంటాను.

blue-flower-oob

 

వాడిన technique అదే అయినప్పటికీ, ఈ క్రింది ఫోటోలలో కలిగిన effect, ఫలిత భ్రమ – resultant illusion- పై ఫోటో కంటే భిన్నమైనదని చూడగానే తెలుస్తుంది. TV viewing లో real time experience ని చెప్పుకోవడానికి ఈ manipulation technique నే ఉపయోగించి advertise చేసుకోవడాన్ని చూస్తుంటాం కూడా!

unknown_bfly_oob

common_emigrant_oob

క్రీడాభిరామము -(1)

kaakatiiya_1

తెలుగులో ‘క్రీడాభిరామం’ ఒక విలక్షణమైన కావ్యం. భారతీయ సంప్రదాయంలో దశరూపకాలలో ఒకటైన ‘వీధి’ నాటక పధ్ధతిలో ఈ కావ్యం వ్రాయబడింది. ఈ కావ్యానికి కర్త వినుకొండ వల్లభరాయడు. అయితే, ఇందులోని ప్రతి పద్యంలో కనిపించే శ్రీనాథుని తరహా పద్యనిర్మాణం, భాష, శృంగార పదజాలం ఈ కావ్యం అసలుకి శ్రీనాథుని చేతనే రచించబడి ఏ కారణం చేతనో వల్లభరాయని పేర ప్రచారంపొందిందని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ప్రబలంగా ఉండింది. ఒకవైపు పెద్దలలో ఆ అభిప్రాయం అలా ఉన్నప్పటికీ, క్రీడాభిరామం కర్తృత్వం వల్లభరాయనికే ఆపాదించబడి ఇప్పటికీ పదిలంగానే వుంది.

తెలుగులోని పద్యకావ్యాలలో నిజానికి ‘క్రీడాభిరామం’ ఉన్నంత దగ్గరగా మరే కావ్యం ఉండదనే మాట అంత నిజం. సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకునిచే రచించబడిన ‘ప్రేమాభిరామం’ అనే కావ్యాన్ని అనుకరిస్తూ ‘క్రీడాభిరామం’ రచించబడిందని వల్లభరాయడే చెప్పిన మాట. అయితే, ‘ప్రేమాబిరామం’ ఇప్పటికీ లభించనిది కాబట్టి. ఈ అనుకరణ ఎలాంటిదనేది ఇప్పటికీ అస్పష్టమే!

వినుకొండ వల్లభరాయని తండ్రి తిప్పయామాత్యుడు విజయనగర ప్రభువైన రెండవ హరిహరరాయల కొలువులో రాజోద్యోగి అనే అధారాన్ని బట్టి ‘క్రీడాభిరామం’ బహుశా 15వ శతాబ్ది ప్రధమార్ధంలో రచించబడి వుండవచ్చని తేల్చారు. ‘క్రీడాభిరామం’ ఏకాశ్వాస ప్రబంధం. మొత్తం 245 పద్యగద్యలతో చంపూ పధ్ధతిలో చేయబడిన రచన. కాకతీయుల ఓరుగల్లు నగరం, కోట, అందులో ప్రజల వేషభాషలూ, ఆహారాలూ, అలవాట్లూ ఇందులో వర్ణించబడ్డాయి. అయితే, ఇందులో అక్కడక్కడా వర్ణనలలో చోటుచేసుకున్న సభ్యంకాని పదజాలం, వర్ణనా విధానం కారణంగా ఈ మొత్తం రచన చెడ్డదిగానూ, మామూలు పాఠకులకు పఠనయోగ్యమైనది కానిదిగానూ నిర్ధారించబడింది.

సభ్యంకాని, అభ్యంతరకరమయిన వర్ణనలు వున్న భాగాలను మినహాయిస్తే, ‘క్రీడాభిరామం’ నిస్సందేహంగా ఒక విలక్షణమైన రచన. ఆ కాలపు ఏ కవీ ఊహించని కథా వస్తువుతో ఒక కాల శకలాన్ని – కాకతీయుల పరిపాలనా కాలంలోని ఒక రోజును – వాస్తవానికి ఏవిధంగానూ అతీతంగా అనిపించనట్లుండే పాత్రల ద్వారా అక్షరభధ్ధంచేసి చూపించిన రచన. కథానాయకులనదగిన గోవింద మంచనశర్మ, అతని అనుచరుడు (financier) అనదగిన టిట్టిభశెట్టి…వీరిరువురు నడిచే మార్గంలోనే పాఠకుడినిగూడా మానసికంగా నడిపించగలిగేంత ప్రతిభావంతమయిన రచనావిధానంతో ముందుకు సాగుతుంది ఈ రచన. ఆకారణంగా, ఈ కావ్య సౌందర్యమంతా ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో, గద్యలో అక్షరాలతో చిత్రించి చూపించిన ఆనాటి కాకతీయ జనజీవనం వుండి పాఠకుని మనోనేత్రాలకు కనబడుతుంది.

కాలగమనంలో మరుగునపడిపోయిన ఈ రచన, మళ్ళీ 1909లో బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి పుణ్యమాని, వారే ప్రచురించిన ‘విస్మ్రుతకవులు’ శీర్షిక పరంపరలో భాగంగా వెలుగు చూసింది. ఆ తరువాత, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి విపులమైన పీఠికతోనూ, వారి కొన్ని సవరణలతోనూ 1928లో ముద్రించబడింది. ఆ తరువాతి కాలంలో ఎమెస్కో వారు వారి ‘సంప్రదాయ సాహితి – 20’ గా స్వర్గీయ బి.వి. సింగరాచార్యగారి ‘సమాలోకనం’ తో 1972లో ప్రచురించారు. ఇవి నాకు తెలిసిన ప్రతులు, చివరి రెండూ నాకు అందుబాటులో వున్నవి. ఇవి కాకుండా స్వర్గీయ బండారు తమ్మయ్య గారి సంపాదకత్వంలో వావిళ్ళవారు ప్రచురించిన ప్రతి 1960నాటిది, శ్రీ బి.ఎన్. శాస్త్రి గారి పీఠికతో నవోదయ సమితి, హైదరాబాదు వారు ప్రచురించినది 1968 నాటిది కూడా వున్నాయి.

ఇందులో అసభ్యత అంటూ ఏమాత్రమూ లేని పద్యాలను సాధ్యమయినంత అందంగా అలంకరించడము, వీలయినంత సౌందర్యవంతంగా భావం చెడకుండా ఆంగ్లంలోకి అనువదించడమూ అనేవి ఈ రచనను ఇంకాస్త glorify చేసే దిశగా నా మనసుకు తోచిన, నేను చాలా కాలంగా అనుకుంటున్న సంగతులు. వరంగల్లులో ఇప్పటి కోట శిథిలాలలో నేను తీసిన ఫోటోలపై, ఇందులో అతి ముఖ్యమైనవిగా అనిపించిన పద్యాలను వుంచి Photo Cards గా చేసి, ఒక abridged edition గా అవసరమైన notes తోనూ ఆంగ్లంలోనికి అనువాదంతోనూ ఈ పోస్టుల పరంపర సాగుతుంది.

***                                                            ***

“గణన కెక్కిన దశరూపకములయందు
వివిధ రసభావభావన వీథి లెస్స
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రభంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుఁడు.”

‘క్రీడాభిరామం’ కృత్యవతరణ పద్యం ఇది.

రూపకం అంటే దృశ్య కావ్యం అని అర్ధం. బారతీయ సంప్రదాయంలో దశరూపకాలు ఇవి:
1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంకము, 10. ఈహామృగము.

ఈ పదింటిలో ఎనిమిదవది వీధి. అయితే, ‘వీధి’  నాటక పధ్ధతి ఎంతగా జనాదరణ పొందిందో వేరే చెప్పనక్కరలేదు. వినోదానికైనా, ఒక సందేశాన్ని జనం మనసులలోకి పంపించాలన్నా ఆధునికంగానూ ఈ పధ్ధతినే ఆశ్రయించడం ఇప్పటికీ చూస్తుంటాం.

 Among the much acclaimed ten methods of drama,
Method ‘Street’ capable of exhibiting various emotions
Is without doubt the best, if you order me to reveal
Which great poet authored this Prabandhathen listen.

పట్టు (Grip)

చిన్న జంతువైనా, పెద్ద జంతువైనా, అది నివసించే ప్రదేశాన్ని బట్టి ఒక్కొక జంతువుకు ఒక్కొక చోట పట్టు అధికంగా వుంటుంది. మొసలికి నీళ్ళలోను, ఉడుముకు నేల మీదా, సాలీడుకు దాని web లోనూ, పాకే బల్లికి గోడ మీదా ఇత్యాదిగా. అలాగా, పాకే జంతువులలోనే ఒకటైన దీనికి grip ఇలాగా…

GRIP_1

అదలా వుంటే, ఈ కందిరీగ, సైజులో  దానికంటె పెద్దదయిన పురుగును ఎక్కడినుంచో ‘పట్టి’ తెచ్చుకొంటోంది. అవతల ఆ పురుగు ఎంత గింజుకున్నా కందిరీగ పట్టునుంచి విడిపించుకోలేక పోతోంది. ప్రకృతి ధర్మం గదా మరి!

GRIP_2

GRIP_3

Common Sandpiper పక్షి

Common Sandpiper Bird -image/1
Common Sandpiper Bird -image/1

పరిమాణంలో చిన్నదిగా, పుల్లలులా అనిపించేంత సన్నని కాళ్ళతో ఉంటుంది ఈ పక్షి.

Water bodies – చెరువులు, వాటి బురద బురదగా ఉన్న అంచులలోనూ, సముద్రపు ఒడ్డున బీచి లలోనూ ఉంటుంది. ఆ తేమ నిండివున్న ప్రదేశాలనుంచి చిన్నచిన్న పురుగులను వాటిని ఏరుకుని తింటూంటుంది. Water bodies కి దగ్గరలోనే నేల మీదనే గూడు ఏర్పాటు చేసుకుని పిల్లలను పొదుగుతుందట ఈ పక్షి.

Common Sandpiper Bird -image/2
Common Sandpiper Bird -image/2

గోవాలో, మజౌడా (Majorda) బీచిలో తీసినవి ఈ ఫోటోలు. అల వొడ్డుకు వచ్చి వెనక్కి వెళ్ళేంతలోనే చాల వేగంగా ఈ పక్షి తీరానికి కొట్టుకుని వచ్చిన వాటిల్లోంచి అది అహారంగా తినగలిగే వాటిని వెతుక్కుని ముక్కున కరుచుకుని తినేస్తుంది.

Common Sandpiper Bird -image/3
Common Sandpiper Bird -image/3

సముద్రపు నీటి అల వేగాన్ని తట్టుకుని ఇంత చిన్నదిగా అనుపించే ఈ పిట్ట  నిలబడగలదా అనిపిస్తుంది గాని ఆ నీళ్ళలో ఇది పరుగెట్టే వేగం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దానికి ప్రకృతి సహజంగా వచ్చిన దాని technique వుంది. అదే దానిని కాపాడుతూ వుంటుంది. ఆ మాటకొస్తే ఏ జంతువునైనాను!

Common Sandpiper bird -image/4
Common Sandpiper bird -image/4