సీతాకోకచిలుకలు – Common Tiger butterfly

Danaus genutia – Common Tiger butterfly

Danaus genutia – female (image-1)

భారతదేశంలో చాల ఎక్కువగా కనుపించే సీతాకోకచిలుకలలో ఈ Common Tiger సీతాకోకచిలుక ఒకటి. దీనినే Striped Tiger సీతాకోకచిలుక అని కూడా పిలుస్తారు. ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Danaus genutia. Nymphalidae కుటుంబంలో ‘Crows and Tigers’ అనే తెగ (గుంపు) కు చెందినది ఈ సీతాకోకచిలుక. దీని పూర్తి శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇలా ఉంటుంది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Nymphalidae, Tribe: Danaini, Genus: Danaus, Species: Danaus genutia.

Danaus genutia – female (image-2)

ఈ సీతాకోకచిలుక చాలా వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కనుపించే  Monarch butterfly (Danaus plexippus) ని  పోలి వుంటుంది. రెక్కల నిడివి 75 నుండి 90 మి.మీ. ఉంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయపు  కాంతి లాంటి tawny (brownish yellow) రంగు రెక్కల మీద నల్లని చారలతో చూపులకు (striking గా) కొట్టవచ్చేలా కనబడుతుంది.

రెక్కల అంచులు నల్లని బార్డరుతో ఉండి ఆ బార్డరుమీద తెల్లనిమచ్చలు రెండు వరసలలో అమరి ఉంటాయి. రెక్కల రంగు లోపలి వైపు, మీది వైపుతో పొలిస్తే కొంత లేతగా (pale) అనిపిస్తుంది. ఈ సీతాకోకచిలుకలలో మగ సీతాకోకచిలుకలకు వెనకరెక్కల లోవైపు మీద తెలుపు-నలుపు రెంగులో ఒక మచ్చ స్పష్టంగా ఉంటుంది. ఇదొక్కటే ఈ సీతాకోకచిలుకలలో మగ, ఆడ సీతాకోకచిలుకలను వేరుగా గుర్తించడానికి మార్గం. మిగతా అన్ని విషయాలలో అంతగా రూపసామ్యన్ని కలిగి ఉంటాయి.

Danaus genutia – male (image-1)

ఈ సీతాకోకచిలుకలు భారతదేశం, శ్రీలంక, మ్యాన్మార్ మరియు ఇతర అగ్నేయ ఆసియా దేశాలలోనూ, ఆస్ట్రేలియాలోనూ సాధారణంగా కనుపిస్తుంది. బలమైన రెక్కలు, కొంచెం మందంగా leathery గా కనబడతాయి. ఈ కారణం వలన ఎగరడంలో బలం కనిపిస్తుంది, తేలిపోతున్నట్లుగా ఉండదు. అయితే మరీ ఎత్తు ప్రదేశాలకు మాత్రం ఎగరదు. తమ అభక్షణీయత (unpalatability) ని చాటుకోవడానికే పరిణామక్రమంలో ఇవి వీటి రెక్కలను ఇంత ముదురు రంగుతోనూ, వాటిమీద నల్లని చారలతోనూ striking గా ఉండేటట్లుగా చేసుకున్నాయని చెబుతారు. ఈ సీతాకోకచిలుక ఫోటోలను నేను బెంగళూరు లోని లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను.

Danaus genutia – female (image-3)

ఇక్కడ ప్రదర్శించబడిన ఇమేజ్ లు అన్నీ తగ్గించబడిన కొలతలతో ఉన్నవి కాబట్టి, ఈ ఇమేజ్ ల మీద ఎక్కడ క్లిక్ చేసినా వాటిని high dimension లో చూడడానికి వీలవుతుంది.