సీతాకోకచిలుకలు – Common Jezebel butterfly

Delias eucharis – Common Jezebel butterfly

ఈ బ్లాగు శీర్షికను అలంకరించిన రంగు రెక్కల అందమైన సీతాకోకచిలుక ఇది – Common Jezebel butterfly. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ సీతాకోకచిలుక కనుపిస్తుంది. Pieridae కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Delias eucharis. ఈ సీతాకోకచిలుక పూరి శాస్త్రీయ వర్గీకరణ (Scientific classification) ఇది – Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Pieridae, Genus: Delias, Species: D. eucharis.

Delias eucharis (image-1)

6.5 నుంచి 8.5 మి.మీ., నిడివి ఉండే రెక్కలతో మొత్తం పరిమాణంలో అంతపెద్దదిగానూ చెన్నదిగానూ కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. రెక్కల పైవైపు తెల్లగానే ఉంటుంది గాని, లోవైపు మాత్రం నల్లని చారలతోనూ మధ్యలో పసుపు ఎరుపు రంగుల మచ్చలతో అందంగా కనబడుతుంది. వీటిలో ఆడ మగ సీతాకోకచిలుకలు, రెక్కల మీద నల్లని చారలు ఆడ సీతాకోకచిలుకలలో కొంత ఎక్కువ మందంగా ఉండడమన్న స్వల్పమైన తేడా తప్ప, మిగలిన అన్ని విషయాలలో చూడదానికి దాదాపుగా ఒకటే విధంగా ఉంటాయి.

ఎండపొద్దెక్కి వాతావరణంలో కాస్త వేడి పెరిగాక ఈ సీతాకోకచిలుకలు హుషారుగా తయారవుతాయి. 7000 అడుగుల ఎత్తు ప్రదేశాలలో కూడా ఈ సీతాకోకచిలుకలు కనబడతాయట. చెట్లు, పూవులున్న ప్రదేశాలలో చాలా తరచుగా ఈ సీతాకోకచిలుకలు కనబడతాయి. వీటి రెక్కల మీదున్న కాంతివంతమైన రంగు వీటికి వీటి లార్వా  దశలో అవి తీసుకునే ఆహార పదార్ధాలలోంచి పోగుచేసుకున్న విషపదార్ధాల (toxins) వలన చేకూరడం కారణంగా ఇవి అభక్షణీయ (unpalatable) లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ లక్షణాన్ని తెలియజేయడానికే ఎప్పుడు చూసినా వాటి రెక్కల లోవైపు మీదున్న ఆ కాంతివంతమైన రంగులను వీటిని పట్టి తినాలని దగ్గర చేరబోయే కీటకాలు దగ్గరకు రాకుండా చేసుకోవడానికి వాటికి కనబడేటట్లుగా ప్రదర్శిస్తూనే వుంటాయి.

Delias eucharis (image-2)

Mud-puddling చేస్తాయి. ఈ సీతాకోకచిలుకల్కున్న అభక్షణీయత (unpalatability) అనే లక్షణం వలన, వీటి అనురూపమైన (mimic అయిన) సీతాకోకచిలుక ఒకటి Painted Sawtooth అన్న పేరు గల సీతాకోకచిలుక. రెక్కల అంచుల బారునా ఉన్న ఎర్రని మచ్చల ఆకారంలోని తేడాతో ఈ mimic ను గుర్తిస్తారు. భారతదేశంలోనే కాక, ఈ సీతాకోకచిలుకలు శ్రీలంక, థాయిలాండ్, మ్యాన్‌మార్ మొదలైన దేశాలలో కూడా కనబడుతుంది.

ఈ సీతాకోకచిలుకల ఫోటోలను నేను బెంగళూరు లోని లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను.

Delias eucharis (image-3)

ఇక్కడ ప్రదర్శించబడిన ఇమేజ్ లు అన్నీ తగ్గించబడిన కొలతలతో ఉన్నవి కాబట్టి, ఈ ఇమేజ్ ల మీద ఎక్కడ క్లిక్ చేసినా వాటిని higher dimension లో చూడడానికి వీలవుతుంది.