సీతాకోకచిలుకలు – Blue Tiger butterfly

Tirumala limniace – Blue Tiger butterfly

Tirumala limniace – female (image-1)

భారతదేశంలో చాలా ఎక్కువగా కనుపించే సీతాకోకచిలుకలలో ఈ Blue Tiger సీతాకోకచిలుక ఒకటి. ఇది Crows and Tigers అనే గుంపు కు చెందిన సీతాకోకచిలుక. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చాలా విస్త్రుతంగా వలసలు వెళ్ళే (వలసప్రవృత్తిని కనబరిచే) సీతాకోకచిలుక ఈ Blue Tiger సీతాకోకచిలుక. Nymphalidae కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం Tirumala limniace. ఈ సీతాకోకచిలుక పూర్తి శాస్త్రీయ వర్గీకరణ (Scientific clasification) ఇలా ఉంటుంది – kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order: Lepidoptera, Family: Nymphalidae, Genus: Tirumala, Species: T. limniace.

Tirumala limniace – female (image-2)

75-95 మి.మీ. నిడివి ఉండే పెద్ద పెద్ద నల్లని రెక్కల మీద లేత నీలం రంగులో, రెక్క మొదలయ్యే (base) భాగం దగ్గర చారలు, పోను పోనూ ఆ పైన మచ్చలు గానూ ఉంటాయి. ఆడ, మగ సీతాకోకచిలుకలు రెండింటికీ ఇలాగే ఉంటాయి. మగ సీతాకోకచిలుకకు వెనుక రెక్క లోపలివైపు రెక్క క్రింగిభాగంలో గంట ఆకారం (bell shape)లో ఒక secondary sex mark ఉంటుంది. ఈ గుర్తు సహాయంతోనే ఈ సీతాకోకచిలుకలలో ఆడ మగ సీతాకోకచిలుకలను విడిగా గుర్తించడానికి వీలవుతుంది.

అన్ని ఎత్తులకూ ఎగరగలిగేవే అయినా, సాధారణంగా భూమి నుంచి పదీ పదిహేను అడుగుల ఎత్తులోనే ఎగురుతూ కనిపిస్తాయి. సాధారణంగా అతి వేగంగా కాకుండా, కొంతదూరం రెక్కలు ఆడిస్తూ ఎగిరి, పూవులను సమీపించే కొలదీ ఎగరడం చివరిదశలో గాలిలో జారుకుంటూ (gliding) సమీపించడం అనే లక్షణం ఈ సీతాకోకచిలుకలలో కనిపిస్తుంది.

Tirumala limniace butterfly

గుంపులుగా Mud-puddling చేస్తాయి. వీటికి వీటి రూపాన్ని అనుకరించే సీతకొకేచిలుకలు (mimic లు) కూడా ఎక్కువే. వాటిలో ముఖ్యమైనదిగా Common mime సీతాకోకచిలుకను చెబుతారు. మిగతావి, Dark Blue Tiger, Glassy Blue Tiger, Glassy Tiger అనే పేర్లతో ఉండే సీతాకోకచిలుకలుగా చెబుతారు. వీటిల్లో ముఖ్యంగా Dark Blue Tiger నుంచి ఈ Blue Tiger సీతాకోకచిలుకను గుర్తించడం కూడ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ క్రింది ఇమేజ్ లో ఉన్నడి వెనకరెక్క లోవైపు అడుగు భాగంలో secondary sex mark తో Dark Blue Tiger (Tirumala septentrionis) మగ సీతాకోకచిలుక. రెక్కల మీద చారలు Blue Tiger సీతాకోకచిలుక రెక్కల మీద చారలతో పోలిస్తే ముదురు నీలం రంగులో ఉండడం, ఈ చారల మధ్య ఖాళీ కూడా ఎక్కువగా ఉండడం ఈ సీతాకోకచిలుక Dark Blue butterfly అని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా, ఈ రకం సీతాకోకచిలుకలలో అసలునూ దాని అనురూపాలనూ (original నూ దాని mimic లనూ) గుర్తించడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. బాగా పరిశీలన తరువాత గాని పూర్తిగా తేల్చి చెప్పలేం.

Tirumala septentrionis – male (image-1)

ఈ సీతాకోకచిలుకల ఫోటోలను నేను బెంగళూరు లోని, లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీశాను. ఇక్కడ ప్రదర్శించబడిన ఇమేజ్ లు అన్నీ తగ్గించబడిన కొలతలతో ఉన్నవి కాబట్టి, ఈ ఇమేజ్ ల మీద ఎక్కడ క్లిక్ చేసినా వాటిని higher dimension లో చూడడానికి వీలవుతుంది.

Tirumala limniace – female (image-3)