వగటొర్ బీచ్, గోవా

అంజున బీచ్ కి కొద్ది దూరంలోనే వుండే ఉత్తర గోవాలోని మరొక బీచ్ వగటొర్ బీచ్.

Vagator-1

గోవా లోనూ (వాస్కో లోనూ) నేను ఇప్పటిదాకా చూసిన ఆరు ఏడు బీచ్ లలో బాగా – అంటే సముద్ర తీరాన కాస్త ప్రశాంతంగా నడవడానికి గాని, చల్లని సముద్రపుగాలికి ఒకింత సేదదీరడానికి గాని బాగుండేదిగా – అనుపించిన బీచ్ లలో ఒకటి ఈ వగటొర్ బీచ్. (ఈ లక్షణాలు పూర్తిగా వున్న నాకు బాగా నచ్చిన బీచ్ మజోర్డా బీచ్. దానిని గురించి తరువాత)

తీరం వెంబడి ఎర్రమట్టితో ఉన్న ఎత్తైన మట్టిదిబ్బలు ఈ వగటొర్ సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత నిచ్చాయని చెబుతారు.

Vagator-1A

Vagator-2

అక్కడక్కడా rocky గా వున్నా మొత్తం మీద సముద్రతీరం వెంబడి అలలతాకిడి మరీ aggresive గా ఉండకుండా leisurely walk కి అనుకూలంగా వుంటుంది. Foreigners తాకిడి అంత ఎక్కువగా వుండని గోవా బీచిలలో వగటొర్ బీచ్ ఒకటి. (Foreigners చాలా చాలా ఎక్కువగా వుండే బీచిలలో  ఒకటి బాగా బీచ్. దానిని గురించి తరువాత).

అక్కడక్కడా కొద్దిగా unclean గా అనుపించినా, మొత్తంమీద సముద్రతీరం పొడుగునా చాలావరకు clean గా వుంటుంది వొగటొర్ బీచ్.

Sunset దృశ్యాలను ఎన్నైనా తీసుకోవచ్చు ఇక్కడ. సూర్యాస్తమయం పూర్తీయే కొలదీ సముద్రం పై మారే రంగులు ఒక్కొక నిమిషానికి ఒక్కొక రకంగా వుంటాయి.

Vagator-3

Vagator-4

Vagator-5

Vagator-9

Vagator-6

Vagator-7

Vagator-8

అంజున బీచ్, గోవా

Anjuna-1

ఉత్తర గోవా (North Goa) లోని బీచ్ లలో ఒకటి అంజున బీచ్. అంజున అనేది గ్రామం పేరు.
ఈ అంజున బీచ్ కూడా శిలామయమైనది (rocky) గానే  ఉంటుంది. బీచ్ waters దగ్గరకు వెళ్ళేందుకు వీలుగా ఏర్పరిచిన మార్గంగుండా వెళ్ళాలి. సముద్ర తీరంలోని శిలలపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం.

Anjuna-2

Anjuna-3

ఇక్కడి తీరం వెంబడినే వున్న కొండపై ఒక fort కు సంబంధించిన శిధిలాలున్నాయి. Chapora fort అని పేరున్న ఈ fort wall సముద్రతీరం వెంబడి నిలబడి వున్న ప్రదేశాన్నుంచి కనబడుతుంది.  బీజాపూర్ సుల్తానులలో ఒకరైన ఆదిల్ షా చే నిర్మించబడిన ఈ కోట  Shahpura అనే పేరుతో మొదట వున్నది, పోను పోను ఉచ్చారణలో Chapora గా మారిందని చెబుతారు.

Chapora fort-wall-2

Chapora fort-wall-1