సీతాకోకచిలుకలు – Common Emigrant butterfly

Catopsilia pomona – Common Emigrant butterfly

Catopsilia pomona – Male (image-1)

Catopsilia pomona – Female (image-1)

Catopsilia కు చెందిన సీతాకోకచిలుకలలోని Emigrant సీతాకోకచిలుకలలో ఈ Common Emigrant ఒకటి. (రెండవది Mottled Emigrant సీతాకోకచిలుక). ఈ Common Emigrant సీతాకోకచిలుకకు Lemon Emigrant అనే పేరు కూడా ఉంది. ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళడం అనే లక్షణం కలిగి ఉండడం వలన ఈ సీతాకోకచిలుకలకు ఆ పేరు వచ్చింది. Pieridae కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక శాస్త్రీయ వర్గీకరణ (Scientific claasification) ఇలా ఉంటుంది -Kingdom: Animalia, Phylum: Arthropoda, Class: Insecta, Order:Lepidoptera, Family: Pieridae, Genus: Catopsilia, Species:Catopsilia pomona.

Catopsilia pomona – Male (image-2)

Catopsilia pomona – Female (image-2)

క్రీము రంగులో వుండే మెత్తని కాంతివంతమైన రెక్కలకు అడుగుబాగంలో ఈ క్రీము రంగు ఇంకొంత చిక్కగా ఉన్నట్లుగా కనబడుటుంది. ముందు రెక్క అంచు ఒక్కొకప్పుడు నల్ల రంగు బార్డరుతో ఉండి కనబడుతుంది. వీటిలో ఆడ సీతాకోకచిలుకలలో ముందు రెక్క అంచులో ఈ నల్ల రంగు బార్డరు కొంత ప్రస్ఫుటంగానూ, మరింతగా రెక్క లోపలికి వ్యాపించీ కనబడుతుంది. వీటిలో ఆడ సీతాకోకచిలుకల రెక్కలపై అక్కడక్కడా గుండ్రని చిన్న చిన్న ఒకటి రొండు మచ్చలు కూడా కనబడతాయి.

Catopsilia pomona – Male (image-3)

Catopsilia pomona – Female (image-3)

ముందు చెప్పుకున్నట్లుగా, ఈ సీతాకోకచిలుకలకు వలసవెళ్ళే లక్షణం ఎక్కువ. గుంపులుగా వెళతాయి. గుంపులుగానే వెళ్ళి తడి ప్రదేశాలలో mud puddling చేస్తూ కనబడతాయి. ఈ Common Emigrant సీతాకోకచిలుకలు ఆసియాలోనూ, ఆస్ట్రేలియా కొన్ని ప్రాంతాలలోనూ కనబడతాయి. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో చాల ప్రదేశాలలో కనబడతాయి. ఇక్కడి ఈ సీతాకోకచిలుకల  ఫోటోలు నేను బెంగళూరు లాల్ బాగ్ బొటానికల్ గార్డన్స్ లో తీసినవి.

Catopsilia pomona – Male (image-4)

Catopsilia pomona – Female (image-4)